హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు అట్టర్ ఫ్లాప్.
భాగ్యనగరవాసుల కలల ప్రాజెక్టు హైదరాబాద్ మెట్రో రైలు నవంబర్ 28న ప్రధాని మోదీ ప్రారంభించారు అయితే ఇప్పుడు నగర వాసుల నుండి అధరన కరువైంది మెట్రో రైలు ఛార్జీలు అదికంగా ఉండటంతో ప్రయాణీకులు లేక మెట్రో స్టేషన్‌లు కలిగా ఉంటున్నాయి స్టేషన్ లో ప్రయాణీకులకంటే సిబ్బందే ఎక్కువ కనిపిస్తున్నారు. మెట్రో రైలు కనీస ఛార్జీ రూ.10, గరిష్ట ఛార్జీ రూ.60గా నిర్ణయించారు. 2 కిలోమీటర్ల వరకు రూ.10, రెండు నుంచి నాలుగు కి.మీ. వరకు రూ.15, నాలుగు నుంచి ఆరు కి.మీ. దూరానికి రూ.25, ఆరు నుంచి ఎనిమిది కి.మీ. దూరానికి రూ.30, ఎనిమిది నుంచి 10 కి.మీ.లకు రూ.35.
అత్యఅవసరం అయితే కానీ ప్రజలు మెట్రో రైలు ఆశ్రయించడం లేదు ఒక వ్యక్తి కూకట్పల్లి నుండి అమీర్‌పేట్ కి వెళ్ళాలంటే బస్ లో రూ.10 నుండి రూ.12 ఛార్జీ ఉంటే మెట్రో కు రూ.35 ఖర్చు చేయాల్సి వస్తుంది.ఇద్దరు వ్యక్తులు బైక్ పై KPHB నుండి నాగోలు వెళ్లిరావటానికి రూ.100 ఖర్చు అవుతుంటే మెట్రో రైలులో వెళ్లిరావటానికి రూ.240 ఖర్చు చేయాల్సి వస్తుంది.అందు వలన ప్రయాణీకులు మెట్రోకు మొగ్గు చూపడం లేదు.మెట్రో రైలులో ఎన్నో ఆదునిక సౌకర్యాలు ఉన్న అత్యఅవసరం అయినవారు ఆఫీస్ కి సమయానికి చేరుకోవాలనుకునే వారు సరదకి ఎక్కలనుకునే వారు తప్ప మిగిలిన వారు ఆదరణ చూపడం లేదు.
ఎల్‌అండ్‌టీ సంస్థ కి ఇన్‌డైరెక్ట్ ఇన్‌కమ్(మాల్స్ వ్యాపార వాణిజ్య సముదాయాలు, మెట్రో పిల్లర్ ప్రకటనలు మరియు ఇతర ప్రకటనల) రూపంలో ఆదాయం వచ్చే అవకాశం ఉండటంతో ఛార్జీలు తగ్గించే అవకాశం కనిపించడం లేదు.అందు వలన నగర వాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరే అవకాశాలు ఇప్పుడప్పుడే కనిపించడం లేదు.
http://www.velladi.info/2017/12/blog-post_29.html
Post a Comment