ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంలోని క్రెడిట్ లింక్‌డ్ సబ్సిడీ పథకం ద్వారా మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.ఇల్లు కొనేందుకు, కొత్త ఇంటిని నిర్మించుకునేందుకు మధ్య తరగతికి అంత స్తోమత ఉండదు.కేంద్ర సబ్సిడీ ద్వారా మొదటిసారి రుణం తీసుకుని ఇల్లు కొనుక్కునే వారికి, కట్టించుకునే వారికి కేంద్రం చేయూతనిస్తోంది. వార్షికాదాయం రూ.18 లక్షల వరకూ ఉన్నా సరే.. వారు ఇంటికోసం తీసుకునే రుణంలో కొ0త్త మొత్తానికి కేంద్ర ప్రభుత్వం వడ్డీ సబ్సిడీ ఇవ్వనుంది. 20 ఏళ్లకు గృహ రుణం తీసుకుంటే వారు చెల్లించే వడ్డీలో దాదాపు రూ.2.4 లక్షల మొత్తాన్ని కేంద్రం సబ్సిడీగా చెల్లిస్తుంది.దీనికి దరఖాస్తు చేసుకుంటున్న వారి పేరిట, వారి కుటుంబ సభ్యుల పేరిట ఇదివరకే ఇల్లు ఉండరాదు. కుటుంబ సభ్యులు అంటే భార్యా, భర్త, వివాహం కాని పిల్లలు అని అర్థం.
వార్షికాదాయం రూ.6 లక్షల వరకు ఉన్న వారు రుణంపై ఇల్లు సమకూర్చుకుంటే వారికి వడ్డీ రేటులో 6.5 శాతం సబ్సిడీ లభిస్తుంది. అంటే ఉదాహరణకు గృహ రుణంపై 9 శాతం వడ్డీ రేటు చెల్లిస్తున్నారనుకోండి. 6.5 శాతం సబ్సిడీ పోను 2.5 శాతమే చెల్లించాలి. అది కూడా రూ.6 లక్షల రుణానికే ఈ సబ్సిడీ లభించేది. అంటే ఉదాహరణకు ఓ వ్యక్తి రూ.10 లక్షల రుణం తీసుకున్నారనుకుందాం. రూ.6లక్షల మొత్తంపైనే వడ్డీ రేటులో రాయితీ ఉంటుంది. మిగిలిన రూ.4లక్షలపై అసలు వడ్డీ రేటు ఎంతుంటే అంత చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం మీద వడ్డీపై రాయితీ రూ.2.46 లక్షల
వార్షికాదాయం రూ.12 లక్షల వరకు ఉన్న వారు ఇంటి రుణంపై వడ్డీలో 4 శాతం సబ్సిడీ పొందవచ్చు. అది కూడా రూ.9 లక్షల మొత్తానికే. ఒకవేళ రుణం ఇంతకు మించి తీసుకుని ఉంటే మిగిలిన మొత్తంపై వడ్డీ రేటు సాధారణ రేటు ప్రకారమే చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీలో రాయితీ రూ.2.39
వార్షికంగా రూ.18 లక్షల వరకు ఆదాయం పొందుతున్న వారు కూడా ఇంటి రుణంపై వడ్డీ రేటులో 3 శాతం సబ్సిడీ పొందవచ్చు. అది కూడా రూ.12 లక్షల రుణానికే గరిష్టంగా లభిస్తుంది. వడ్డీపై రాయితీ రూ.2.44
సొంత ఇంటి నిర్మాణం లేదా అభివృద్ధి కోసం లబ్ధిదారుడికి ధన సహాయం.
సొంత స్థలం కలిగి, గృహ నిర్మాణం లేదా అభివృద్ధి కోసం ఆసక్తి గల లబ్ధిదారుడికి ప్రభుత్వం ద్వారా రూ. 1.50లక్షల వరకు ధన సహాయం. వీరి సంవత్సర ఆదాయం రూ. 3లక్షలలోపు ఉండాలి.
వెబ్‌సైట్ http://pmaymis.gov.in/

Post a Comment