Header Ads

1992 డిసెంబర్ 6 బాబ్రీ మసీదు కూల్చివేత..

1992 డిసెంబర్ 6 న‌ బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిందిమొఘల్ చక్రవర్తి బాబర్ అయోధ్యలో బాబ్రి మసీదు ను నిర్మించాడు. దీన్ని ఆయన అంతకు ముందే ఉన్న రామాలయాన్ని కూల్చివేసి కట్టారని కొందరి వాదన.

Babri Masjid


రథయాత్ర సమయంలో ఆడ్వాణీ ఇచ్చిన పిలుపునకు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. 1992 డిసెంబర్ 6 న‌ సుమారు లక్షన్నర మంది కరసేవకులు అయోధ్యకు చేరుకున్నారు.ఎల్‌కే ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమా భారతి, అశోక్‌ సింఘాల్‌ తదితరులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు

ఆ ప్రసంగాల వలన కరసేవకులు మసీదు కూల్చివేతకు పూనుకున్నట్టు తెలుస్తుంది.కరసేవకులు మసీదు కూల్చివేత సమయంలో పోలీసులు మౌనంగా ఉన్నారని, కూల్చివేతను అపడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని జస్టిస్‌ లిబర్హన్‌ కమిషన్‌ పేర్కొంది.

బాబ్రీ మసీదు ఉన్న స్థానం శ్రీరామజన్మస్థానం అంటూ.. 1982లో విశ్వహిందూ పరిషత్ రామజన్మభూమి ఉద్యమాన్ని చేపట్టింది. రాజీవ్ ప్రభుత్వానికి మసీదు కార్యాచరణ కమిటీకి చర్చలు జరుగుతున్న తరుణంలోనే 1986 నవంబరు 9వ తేదీన వివాదాస్పద స్థలంలో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన చేసుకునేందుకు వీహెచ్‌పీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 1990లో అద్వానీ రథయాత్ర బాబ్రీ మ‌సీదు విద్వాంశాని తీవ్రతరం చేశాయి.

No comments